Share News

శ్రీకాంత్‌ ఫామ్‌లోకొచ్చేనా?

ABN , Publish Date - May 06 , 2025 | 03:48 AM

సుదీర్ఘ కాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న కిడాంబి శ్రీకాంత్‌తోపాటు యువ షట్లర్లు ఆయుష్‌ శెట్టి, అనుపమ ఉపాధ్యాయ సత్తా చాటాలనుకొంటున్నారు...

శ్రీకాంత్‌ ఫామ్‌లోకొచ్చేనా?

తైపీ ఓపెన్‌ నేటి నుంచి

తైపీ: సుదీర్ఘ కాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న కిడాంబి శ్రీకాంత్‌తోపాటు యువ షట్లర్లు ఆయుష్‌ శెట్టి, అనుపమ ఉపాధ్యాయ సత్తా చాటాలనుకొంటున్నారు. మంగళవారం నుంచి జరిగే తైపీ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శనపై గురిపెట్టారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్‌.. తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన శంకర్‌తో తలపడనున్నాడు. తరుణ్‌, మిరాబా కూడా బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, అనుపమ, ఆకర్షి కశ్యప్‌ పోటీపడనున్నారు.

Updated Date - May 06 , 2025 | 04:39 AM