Share News

శ్రీలంక ఘనవిజయం

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:24 AM

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక...

శ్రీలంక ఘనవిజయం

అసలంక శతకం

కొలంబో: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. చరిత్‌ అసలంక సెంచరీ (106) సాధించగా, కుశాల్‌ మెండిస్‌ (45) ఫర్వాలేదనిపించాడు. టస్కిన్‌కు 4, తన్జిమ్‌కు 3 వికెట్లు లభించాయి. ఛేదనలో బంగ్లాదేశ్‌ 35.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. హసరంగకు 4, కమిందు మెండి్‌సకు 3 వికెట్లు దక్కాయి. తన్జిద్‌ హసన్‌ 62, జాకెర్‌ అలీ 51 పరుగులతో రాణించారు. ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.

ఇవీ చదవండి:

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:25 AM