Women In Sports: క్రీడలతో వికాసం
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:30 AM
తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన ‘స్పిరిట్ ఆఫ్ ద గేమ్’ చర్చాగోష్ఠి స్ఫూర్తిదాయకంగా జరిగింది. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన ‘స్పిరిట్ ఆఫ్ ద గేమ్’ చర్చాగోష్ఠి స్ఫూర్తిదాయకంగా జరిగింది. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, మాజీ ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా, మాజీ బాక్సర్ సరితాదేవి వక్తలుగా పాల్గొన్నారు. అమ్మాయిలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని రాణిస్తే సమాజంలో వివిధ రకాల అసమానతలు తగ్గడంతో పాటు సాంఘిక వికాసం వైపు అడుగులు పడతాయని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి జయేష్ రంజన్, శాట్ వీసీ-ఎండీ సోనీబాలదేవి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..