Share News

Smriti Mandhana: స్మృతి పెళ్లి వాయిదాపై నెట్‌లో ఊహాగానాలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 02:40 AM

భారత క్రికెటర్‌ స్మృతి మంధాన, పలాష్‌ ముచ్చల్‌ పెళ్లి నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం జరగాల్సిన వీరి వివాహం...

Smriti Mandhana: స్మృతి పెళ్లి వాయిదాపై నెట్‌లో ఊహాగానాలు

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ స్మృతి మంధాన, పలాష్‌ ముచ్చల్‌ పెళ్లి నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం జరగాల్సిన వీరి వివాహం ఆగిపోయింది. అయితే, పెళ్లి వేడుకలు, ప్రపోజల్‌ వీడియోలు, ఫొటోలను స్మృతి తన సోషల్‌ మీడియా ఖాతానుంచి తొలగించడం ఏదో జరిగిందన్న అనుమానాలకు తావిచ్చింది. స్మృతి స్నేహితులు జెమీమా, శ్రేయాంక కూడా పెళ్లి వీడియోలను తమ ఖాతాల నుంచి తీసేయడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇదే అదనుగా కొందరు అనేక ఊహాగానాలకు తెరదీశారు. పలాష్‌ మోసం బయటపడడం వల్లే పెళ్లి రద్దయిందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అందుకు ఆధారంగా మేరీ డికొస్టా అనే మహిళతో జరిగిన వాట్సప్‌ చాట్‌ స్ర్కీన్‌ షాట్లను పోస్టు చేశారు. దీనిపై స్మృతి లేదా ముచ్చల్‌ టీమ్‌ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి:

భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

Updated Date - Nov 26 , 2025 | 02:40 AM