Share News

South Africa Second Innings: ముల్డర్‌ శతకం

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:58 AM

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ దక్షిణాఫ్రికా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. వియాన్‌ ముల్డర్‌ (147) శతకం సాధించగా, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

South Africa Second Innings: ముల్డర్‌ శతకం

  • దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 369

  • జింబాబ్వే లక్ష్యం 537

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ దక్షిణాఫ్రికా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. వియాన్‌ ముల్డర్‌ (147) శతకం సాధించగా, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షి ణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 369 పరుగులు సాధించింది. అలాగే జింబాబ్వే ముందు 537 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచింది. మసకద్జాకు నాలుగు.. చివంగ, మసెకెసాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే సోమవారం ఆట ముగిసే సమయానికి 32/1 స్కోరుతో ఉంది.

Updated Date - Jul 01 , 2025 | 02:59 AM