Share News

పట్టుబిగించిన దక్షిణాఫ్రికా

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:16 AM

జింబాబ్వేతో తొలి టెస్ట్‌ రెండోరోజే దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టు బిగించింది. ముల్డెర్‌ (4వికెట్లు), యూసుఫ్‌, కేశవ్‌ మహరాజ్‌ (చెరి 3 వికెట్లు) రాణించడంతో...

పట్టుబిగించిన దక్షిణాఫ్రికా

బులవాయో: జింబాబ్వేతో తొలి టెస్ట్‌ రెండోరోజే దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టు బిగించింది. ముల్డెర్‌ (4వికెట్లు), యూసుఫ్‌, కేశవ్‌ మహరాజ్‌ (చెరి 3 వికెట్లు) రాణించడంతో జింబాబ్వే 251 పరుగులకే ఆలౌటైంది. విలియమ్స్‌ (137) శతకం సాధించాడు. దీంతో సఫారీలకు 167 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆదివారం ఆఖరికి వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేయడంతో సఫారీల ఆధిక్యం 216 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 418/9 వద్ద డిక్లేర్‌ చేసింది.

200 వికెట్ల కేశవ్‌: తాత్కాలిక కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ టెస్ట్‌ల్లో 200 వికెట్లు సాధించిన తొలి సఫారీ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. రెండోరోజు ఆటలో జింబాబ్వే సారథి ఇర్విన్‌ను అవుట్‌ చేసిన 35 ఏళ్ల కేశవ్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు.

ఇవీ చదవండి:

గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!

ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!

పంత్ నాటకం.. నిజం బయటపడింది!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 04:16 AM