South Africa A Clinches: దక్షిణాఫ్రికా ఎ రికార్డు విజయం
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:31 AM
రెగ్యులర్ టెస్ట్ బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్, కుల్దీప్ ఏమాత్రం ప్రభావం చూపలేక పోవడంతో....
417 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సఫారీలు
5 వికెట్లతో భారత్-ఎపై గెలుపు
బెంగళూరు: రెగ్యులర్ టెస్ట్ బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్, కుల్దీప్ ఏమాత్రం ప్రభావం చూపలేక పోవడంతో.. ‘ఎ’ జట్ల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-ఎ 417 పరుగుల అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (91), సెనోక్వెనె (77), హమ్జా (77), బవుమా (59), కానర్ (52 నాటౌట్) అదరగొట్టడంతో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్-ఎపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. సిరీ్‌సను 1-1తో సమం చేసింది. భారీ ఛేదనలో ఆటకు నాలుగో, ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 25/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 417/5 స్కోరు చేసి గెలిచింది. భారత్ 255, 382/7 డిక్లేర్ చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 221రన్స్‌కు ఆలౌటైంది.