Share News

Sourav Ganguly: చాన్సిస్తే కోచ్‌గా పనిచేస్తా

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:13 AM

భవిష్యత్‌లో టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేయాలనుందని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. అలాగే రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి తనకెంతమాత్రం లేదని తేల్చాడు...

 Sourav Ganguly: చాన్సిస్తే కోచ్‌గా పనిచేస్తా

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో టీమిండియా ప్రధాన కోచ్‌గా పనిచేయాలనుందని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. అలాగే రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి తనకెంతమాత్రం లేదని తేల్చాడు. ‘2013లో క్రికెట్‌ నుంచి తప్పుకొన్నాక బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశా. నాకింకా 53 ఏళ్లే కాబట్టి భవిష్యత్‌ ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే కోచ్‌గా చేయాలని ఉంది. కోచ్‌ గంభీర్‌కు అంకితభావం ఎక్కువ. ఈ ఇంగ్లండ్‌ సిరీస్‌ అతడికి కీలకం కానుంది. ఇక రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. ముఖ్యమంత్రి పదవిస్తానన్నా అందులోకి వెళ్లను’ అని గంగూలీ స్పష్టం చేశాడు.

  • రోహిత్‌-కోహ్లీలకు అంత ఈజీకాదు

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ 2027లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ దాకా ఆడడం అంత సులువైన విషయం కాదని గంగూలీ అన్నాడు. ‘వరల్డ్‌క్‌పనకు ముందు భారత జట్టు సుమారు 27 వన్డేలు ఆడుతుంది. అంటే ఏడాదికి సుమారు 15 మ్యాచ్‌లు ఆడాల్సిరావడం వారిద్దరికీ కష్టమైన విషయం’ అని సౌరవ్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు 2003 వన్డే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయనందుకు లక్ష్మణ్‌ తనతో మూడు నెలలపాటు మాట్లాడలేదని అప్పట్లో కెప్టెన్‌గా ఉన్న దాదా చెప్పాడు. ఆ వరల్డ్‌కప్‌లో లక్ష్మణ్‌ స్థానంలో దినేష్‌ మోంగియాను తీసుకున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 03:15 AM