Mohammad Siraj: ఇదో చెత్త అనుభవం
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:16 AM
ఎయిరిండియాపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర అసహనం వ్యక్తంజేశాడు. బుధవారం రాత్రి 7.25కి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (ఐఎక్స్ 2884) విమానంలో గువాహటినుంచి అతడు...
ఎయిరిండియాపై సిరాజ్ ఫైర్
న్యూఢిల్లీ: ఎయిరిండియాపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర అసహనం వ్యక్తంజేశాడు. బుధవారం రాత్రి 7.25కి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (ఐఎక్స్ 2884) విమానంలో గువాహటినుంచి అతడు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి 4 గంటలపాటు వేచి చూసినా..పలుమార్లు విచారించినా..విమానం ఆలస్యానికి సంబంధించి ఎయిరిండియా ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదని సిరాజ్ మండిపడ్డాడు. దాంతో తీవ్ర అసహనానికి లోనైన హైదరాబాదీ తనకిది చెత్త విమాన ప్రయాణ అనుభవమని తేల్చాడు. అంతేకాదు..ఈ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కొద్దని సూచించాడు. ఎయిరిండియా..జరిగిన అసౌకర్యానికి సిరాజ్‌కు క్షమాపణ చెప్పింది. ఊహించని కార్యాచరణ సమస్యలవల్ల విమానం రద్దయిందని వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ