Simranpreet Kaur won a gold medal: సిమ్రన్‌ప్రీత్‌కు స్వర్ణం
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:07 AM
ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత షూటర్ సిమ్రన్‌ప్రీత్ కౌర్ బ్రార్ స్వర్ణం సాధించగా.. అనీ్‌షతోపాటు ఈ ఈవెంట్ బరిలోకి దిగిన తొలిసారే ఐశ్వరీ....
ప్రతాప్ సింగ్, అనీ్‌షకు రజతాలు
ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్
దోహా: ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత షూటర్ సిమ్రన్‌ప్రీత్ కౌర్ బ్రార్ స్వర్ణం సాధించగా.. అనీ్‌షతోపాటు ఈ ఈవెంట్ బరిలోకి దిగిన తొలిసారే ఐశ్వరీ ప్రతాప్ సింగ్ రజతాలతో మెరిశారు. ఆదివారం జరిగిన మహిళల 25 మీ. పిస్టల్ తుదిపోరులో సిమ్రన్‌ప్రీత్ 41 పాయింట్లతో టాప్‌లో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకొంది. మరో భారత షూటర్ ఇషా సింగ్ 15 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. పురుషుల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో ప్రతాప్ సింగ్ 413.3 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో షూటింగ్ క్రీడలోని వరల్డ్, కాంటినెంటల్ చాంపియన్‌షి్‌ప్సలో సింగ్ పతకాలు నెగ్గిన ఆటగాడిగా అరుదైన ఘనతను దక్కించుకొన్నాడు. అర్హత రౌండ్‌లో కూడా సింగ్ 595 పాయింట్లతో పతక రౌండ్‌కు క్వాలిఫై అయ్యాడు. పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్లో అనీష్ 16 పాయింట్లతో రెండో స్థానంతో రజతం అందుకొన్నాడు. కాగా, విజయ్‌వీర్ సిద్ధు త్రుటిలో కాంస్యం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచాడు.