సిఫ్ట్ కౌర్‌కు కాంస్యం
ABN , Publish Date - Jun 13 , 2025 | 02:25 AM
ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో తీవ్ర పోటీ ఎదుర్కొన్న సిఫ్ట్ 453.1 పాయింట్లతో..
మ్యూనిచ్: ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో తీవ్ర పోటీ ఎదుర్కొన్న సిఫ్ట్ 453.1 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. నార్వేకు చెందిన జీనెట్ హెగ్ డ్యూస్టాడ్ (466.9) స్వర్ణం, ఎమీలీ జేగీ (స్విట్జర్లాండ్, 464.8) రజత పతకాలు సాధించారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 592 పాయింట్లు స్కోరు చేసిన కౌర్ రెండో స్థానంతో ఎనిమిది మంది షూటర్ల ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక..ఈ విభాగంలో బరిలో దిగిన ఇతర భారత షూటర్లు ఆషీ చౌక్సీ (589) 11వ, అంజుమ్ మౌద్గిల్ (586) 27వ, ష్రియాంకా సాదంగి (582) 53వ స్థానాలలో నిలిచారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో సిఫ్ట్ కౌర్ పసిడి పతకం కొల్లగొట్టింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి