Share News

విరాట్‌ స్థానం గిల్‌దే

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:41 AM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సలో శుభ్‌మన్‌ గిల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడని వైస్‌-కెప్టెన్‌ పంత్‌ తెలిపాడు. తాను ఐదో స్థానంలోనే బరిలో...

విరాట్‌ స్థానం గిల్‌దే

హెడింగ్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సలో శుభ్‌మన్‌ గిల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడని వైస్‌-కెప్టెన్‌ పంత్‌ తెలిపాడు. తాను ఐదో స్థానంలోనే బరిలో దిగుతానని బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. విరాట్‌ రిటైరైన నేపథ్యంలో నాలుగో నెంబర్‌లో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారోననే చర్చ బయలుదేరింది. దానికి పంత్‌ తెరదించాడు. ‘మూడో నెంబర్‌ బ్యాటర్‌పై ఇంకా చర్చ జరుగుతోంది. కానీ 4, 5 స్థానాలలో ఎవరొస్తారో ఖరారైంది. గిల్‌ నాలుగో నెంబర్‌లో బరిలో దిగే చాన్సుంది. నేను మాత్రం ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తా’ అని పంత్‌ వివరించాడు.

ఇవీ చదవండి:

పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్

నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 03:41 AM