Share News

గిల్‌ చెత్త రికార్డు

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:52 AM

కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి టెస్ట్‌లోనే ఓడిన ఆరో భారత ప్లేయర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ చెత్త రికా ర్డును సొంతం చేసుకొన్నాడు. సీకే నాయుడు, ఎంఏకే పటౌడీ...

గిల్‌ చెత్త రికార్డు

హెడింగ్లీ: కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి టెస్ట్‌లోనే ఓడిన ఆరో భారత ప్లేయర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ చెత్త రికా ర్డును సొంతం చేసుకొన్నాడు. సీకే నాయుడు, ఎంఏకే పటౌడీ, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, విరాట్‌ కోహ్లీ, బుమ్రా తర్వాతి స్థానంలో గిల్‌ నిలిచాడు. కాగా, సారథిగా ఆడిన తొలి టెస్ట్‌లోనే శతకం సాధించినా.. మ్యాచ్‌ను చేజార్చు కొన్న భారత కెప్టెన్‌గా కోహ్లీ, వెంగ్‌సర్కార్‌ సరసన గిల్‌ నిలిచాడు. 1987లో ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన వెంగ్‌సర్కార్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. కానీ, ఆ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడింది. 2014లో అడిలైడ్‌ టెస్ట్‌లో సారథిగా కోహ్లీ తన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు చేశాడు. కానీ, టీమిండియా 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇవీ చదవండి:

రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..

బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..

శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 05:52 AM