Share News

Shubman Gill Out of ODI Series: వన్డే సిరీస్‌కు గిల్‌ దూరం

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:25 AM

Shubman Gill Out of ODI Series Captaincy Race Between Rahul and Pant

Shubman Gill Out of ODI Series: వన్డే సిరీస్‌కు గిల్‌ దూరం

కెప్టెన్సీ రేసులో రాహుల్‌, పంత్‌

గువాహటి: మెడ నొప్పితో బాధపడుతున్న భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు మరింత విశ్రాంతి అవసరమున్నట్టు తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీ్‌సకు అతను దూరం కానున్నాడు. అయితే సఫారీలతోనే జరిగే టీ20 సిరీ్‌సకల్లా గిల్‌ బరిలోకి దిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్సీ రేసులో కేఎల్‌ రాహుల్‌తో పాటు కీపర్‌ పంత్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండో టెస్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్‌ ఏడాది కాలంగా ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. ఈ ఫార్మాట్‌లో ప్రధాన కీపర్‌గా రాహుల్‌నే పరిగణిస్తుండడం గమనార్హం. ఓపెనర్లుగా జైస్వాల్‌, వెటరన్‌ రోహిత్‌తో పాటు టాపార్డర్‌లో కోహ్లీ ఆడనున్నాడు. హర్షిత్‌, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ ప్రధాన పేసర్లుగా ఉండే చాన్సుంది. బుమ్రాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినివ్వచ్చు. స్పిన్నర్‌ కుల్దీప్‌ వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు కానుండగా అక్షర్‌, సుందర్‌, వరుణ్‌ జట్టులో ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Nov 23 , 2025 | 06:25 AM