Share News

Shubman Gill: టాప్‌ 10లో తొలిసారి

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:13 AM

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌...

Shubman Gill: టాప్‌ 10లో తొలిసారి

గిల్‌కు ఆరో ర్యాంక్‌

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల విభాగంలో గిల్‌ తొలిసారి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌ ఏకంగా 15 స్థానాలు ఎగబాకాడు. ఫలితంగా 6వ ర్యాంక్‌లో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ అందుకున్నాడు. అంతకుముందు టెస్టుల్లో గిల్‌ అత్యుత్తమ ర్యాంక్‌ 14 (2023 సెప్టెంబరులో) మాత్రమే. యశస్వీ జైస్వాల్‌ 4వ ర్యాంక్‌తో భారత్‌ నుంచి టాప్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ హ్యారీ బ్రూక్‌ నెంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జో రూట్‌ (ఇంగ్లండ్‌), కేన్‌ విలియమ్సన్‌ (న్యూజి లాండ్‌) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో బుమ్రా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, సిరాజ్‌ 22వ స్థానానికి ఎగబాకాడు. ఆల్‌రౌండర్లలో జడేజా అగ్రస్థానంలో మార్పు లేదు.

ఇవీ చదవండి:

కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!

ఆడలేక మద్దెల దరువు అంటే ఇదే!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:13 AM