Share News

Captaincy Exit: విశ్రాంతి కోరిన అయ్యర్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 06:19 AM

భారత్‌-ఎ కెప్టెన్‌గా వ్యహరిస్తున్న శ్రేయాస్‌ అయ్యర్‌ హఠాత్తుగా జట్టును వీడాడు. మంగళవారం ఆస్ట్రేలియా-ఎతో రెండో అనధికార టెస్ట్‌కు కొద్ది గంటల...

Captaincy Exit: విశ్రాంతి కోరిన అయ్యర్‌

భారత్‌-ఎ జట్టుకు దూరం

లఖ్‌నవూ: భారత్‌-ఎ కెప్టెన్‌గా వ్యహరిస్తున్న శ్రేయాస్‌ అయ్యర్‌ హఠాత్తుగా జట్టును వీడాడు. మంగళవారం ఆస్ట్రేలియా-ఎతో రెండో అనధికార టెస్ట్‌కు కొద్ది గంటల ముందు అయ్యర్‌ సారథ్యాన్ని వీడాలన్న నిర్ణయం తీసుకొన్నాడు. దీంతో అతడి స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ను కెప్టెన్‌గా మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. వెన్నునొప్పి ఇబ్బందిపెడుతున్నందున కొంత విశ్రాంతి అవసరమని..ప్రస్తుతానికి రెడ్‌బాల్‌ క్రికెట్‌నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సెలెక్టర్లకు అయ్యర్‌ లేఖ రాసినట్టు సమాచారం.

మానవ్‌కు 5 వికెట్లు..

రెండో అనధికార టెస్ట్‌లో భారత్‌-ఎ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (5/93) తిప్పేయడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో మొదటిరోజు చివరికి ఆస్ట్రేలియా-ఎ 350/9 స్కోరు చేసింది. టాడ్‌ మర్ఫీ (29), థోర్మ్‌టన్‌ (10) క్రీజులో ఉన్నారు. జాక్‌ ఎడ్వర్డ్స్‌ (88), నాథన్‌ మెక్‌స్వీనీ (74) అర్ధ శతకాలతో రాణించారు.

Updated Date - Sep 24 , 2025 | 06:20 AM