Shreya Ghoshal: శ్రేయా పాటతో..మహిళల వన్డే వరల్డ్‌కప్ షురూ
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:39 AM
మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆరంభ వేడుకల్లో ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషాల్ తన గాన మాధుర్యంతో అలరించనుంది..
గువాహటి: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఆరంభ వేడుకల్లో ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషాల్ తన గాన మాధుర్యంతో అలరించనుంది. ఈనెల 30న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అదే రోజు గువాహటిలో జరిగే భారత్-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు టోర్నీ అధికారిక గీతం ‘బ్రింగ్ ఇట్ హోమ్’ను శ్రేయా ఆలపించనుంది. మరోవైపు భారత్‌లో జరిగే అన్ని మ్యాచ్‌ల టిక్కెట్ల కనీస ధరలను కేవలం రూ.100కే విక్రయించనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. గురువారం నుంచే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలు కూడా ఆరంభమయ్యాయి.