Share News

బ్రూక్‌పై నిషేధం తప్పదా?

ABN , Publish Date - Mar 11 , 2025 | 02:51 AM

ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌ నుంచి ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వైదొలిగాడు. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది...

బ్రూక్‌పై నిషేధం తప్పదా?

ఐపీఎల్‌నుంచి వైదొలగిన స్టార్‌

న్యూఢిల్లీ: ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌ నుంచి ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వైదొలిగాడు. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. జాతీయ జట్టు తరఫున ఆడేందుకే తాను ప్రాధాన్యమిస్తానని బ్రూక్‌ సోషల్‌ మీడియా లో పేర్కొన్నాడు. కానీ ఈ నిర్ణయంతో అతడు రాబోయే రెండు సీజన్ల పాటు నిషేధం ఎదుర్కొనే చాన్సుంది. ఎందుకంటే ఐపీఎల్‌ నిబంధన ప్రకారం..వేలంలో అమ్ముడైన విదేశీ ప్లేయర్‌ ఎవరైనా లీగ్‌ ఆరంభానికి ముందే తప్పుకొంటే అతడిపై రెండు సీజన్లు నిషేధం విధిస్తారు. గాయం విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 02:51 AM