Shock for Swiatek: స్వియటెక్‌కు షాక్
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:54 AM
యూఎస్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్ భామ ఇగా స్వియటెక్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది..
బదులు తీర్చుకొన్న అమందా ఫ సెమీ్‌సకు ఒసాక, సినర్, ఫెలిక్స్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పోలెండ్ భామ ఇగా స్వియటెక్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరుమీదున్న రెండో సీడ్ స్వియటెక్‌కు క్వార్టర్స్‌లో లోకల్ స్టార్ అమందా అనిసిమోవా ఝలక్ ఇచ్చింది. కాగా, పనైపోయిందనుకొన్న మాజీ చాంపియన్ నవోమి ఒసాక మరో సంచలన విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లింది. పురుషుల డిఫెండింగ్ చాంప్ యానిక్ సినర్ కూడా ఫైనల్-4లోకి అడుగుపెట్టాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ అనిసిమోవా 6-4, 6-3తో స్వియటెక్‌ను వరుస సెట్లలో ఓడించింది. ఈ క్రమంలో వింబుల్డన్ ఫైనల్లో తనను చిత్తుగా ఓడించిన పోలెండ్ బ్యూటీపై అనిసిమోవా గట్టిగా బదులు తీర్చుకొంది. మూడో సీడ్ కొకొ గాఫ్‌ను ఓడించిన జపాన్ ప్లేయర్ ఒసాక అదే జోరును కొనసాగించింది. 23వ సీడ్ ఒసాక 6-4, 7-6(3)తో 11వ సీడ్ కరోలినా ముచోవా (చెక్)పై గెలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ సబలెంకాతో జెస్సికా పెగుల, అనిసిమోవాతో ఒసాక తలపడనున్నారు.

సినర్ అలవోకగా..: డిఫెండింగ్ చాంప్ సినర్ అలవోక విజయంతో ముందంజ వేశాడు. ఇద్దరు ఇటలీ ఆటగాళ్ల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సినర్ 6-1, 6-4, 6-2తో 10వ సీడ్ లారెంజో ముసెట్టిపై వరుస సెట్లలో నెగ్గాడు. మరో మ్యాచ్‌లో 25వ సీడ్ ఫెలిక్స్ అగర్ అలియస్సిమి (స్పెయిన్) 4-6, 7-6(7), 7-5, 7-6(4)తో 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచి కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ సెమీ్‌సకు చేరుకొన్నాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అల్కారజ్‌తో జొకోవిచ్, సినర్‌తో ఫెలిక్స్ అమీతుమీ తేల్చుకోనున్నారు.