‘మాడ్రిడ్’లో జొకోవిచ్‌కు షాక్
ABN , Publish Date - Apr 27 , 2025 | 02:25 AM
కెరీర్‌లో 100వ టైటిల్‌పై గురిపెట్టిన టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మాడ్రిడ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ఈ సెర్బియా యోధుడు అనూహ్యంగా ఆరంభ రౌండ్లోనే కంగుతిన్నాడు...
మాడ్రిడ్: కెరీర్‌లో 100వ టైటిల్‌పై గురిపెట్టిన టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మాడ్రిడ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. ఈ సెర్బియా యోధుడు అనూహ్యంగా ఆరంభ రౌండ్లోనే కంగుతిన్నాడు. ఇటలీకి చెందిన 44వ ర్యాంకర్ మ్యాటో అర్నాల్డి 5-3, 6-4తో 4వ సీడ్ జొకోవిచ్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించాడు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న 37 ఏళ్ల జొకోవిచ్.. ఆరంభ మ్యాచ్‌లో ఓడడం గత ఐదు ఈవెంట్లలో అతనికిది నాలుగోసారి కావడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..