Share News

China Open 2025: విజేతలు షి వాంగ్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:30 AM

చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషులు, మహిళల సింగిల్స్‌ టైటిళ్లను షి యుకి, వాంగ్‌ జియీ గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యుకి (చైనా) 14-21, 21-14, 21-15తో తన దేశానికే...

China Open 2025: విజేతలు షి వాంగ్‌

చైనా ఓపెన్‌

చాంగ్జౌ: చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషులు, మహిళల సింగిల్స్‌ టైటిళ్లను షి యుకి, వాంగ్‌ జియీ గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యుకి (చైనా) 14-21, 21-14, 21-15తో తన దేశానికే చెందిన వాంగ్‌ జెన్‌సింగ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌ తుది పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ వాంగ్‌ జియీ 21-18, 21-13తో హాన్‌ ఈ (చైనా) చిత్తుచేసి టైటిల్‌ నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ లియు/టాన్‌ (చైనా) జంట 24-22, 17-21, 21-14తో జాంగ్‌/జియా (చైనా) ద్వయంపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌ తుది పోరులో ఫజర్‌/మహ్మద్‌ (ఇండోనేసియా) జోడీ 21-14, 21-15తో చియా /సో (మలేసియా) జంటపై నెగ్గి టైటిల్‌ అందుకుంది.

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 02:30 AM