Shatadru Dutta: ఈవెంట్ నిర్వాహకుడికి నో బెయిల్
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:08 AM
మెస్సీ పర్యటన ప్రధాన ప్రమోటర్ శతద్రు దత్తాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడిని 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బిద్ధానగర్ సబ్...
శతద్రుకు 14 రోజుల పోలీసు కస్టడీ
కోల్‌కతా: మెస్సీ పర్యటన ప్రధాన ప్రమోటర్ శతద్రు దత్తాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడిని 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బిద్ధానగర్ సబ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మెస్సీ కోల్‌కతా పర్యటనలో చోటు చేసుకున్న అపశ్రుతుల నేపథ్యంలో దత్తాను పోలీసులు శనివారం నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆదివారం అతడిని కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు.