Veteran pacer Mohammed Shami: ఆడమంటే ఆడనన్నాడు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:49 AM
వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఈ ఏడాది మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్‌తో...
న్యూఢిల్లీ: వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఈ ఏడాది మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సతో పాటు ఆసియాకప్ టీ20 టోర్నీ, ఆస్ట్రేలియా పర్యటనకు సైతం అతడిని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. షమికి టెస్టులు ఆడే ఫిట్‌నెస్ లేదనే ఆలోచనలో బీసీసీఐ ఉంటోంది. ఇదే విషయమై షమి, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. సెలెక్టర్లు తనను సంప్రదించడం లేదని, ఫిట్‌గా లేకపోతే తాను రంజీలు ఎలా ఆడగలనని ప్రశ్నిస్తున్నాడు. అయితే బీసీసీఐ వాదన మరోలా ఉంది. అతడిని ఇంగ్లండ్ పర్యటనకు పంపేందుకు సెలెక్షన్ ప్యానెల్ ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని బోర్డు అఽధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ విషయమై షమి చెబుతున్నవి నిజాలు కాదని ఆయన అన్నారు. ‘ఇంగ్లండ్ టూర్‌లో బుమ్రా మూడు టెస్టుల్లో మాత్రమే ఆడతాడు కాబట్టి అక్కడికి షమిని పంపాలని జాతీయ సెలెక్టర్లు భావించారు. ఇందుకోసం సెలెక్టర్లు, సీఓఈ సిబ్బంది అతడిని సంప్రదించేందుకు చాలాసార్లు ఫోన్ ద్వారా ప్రయత్నించారు. ముందుగా ఇంగ్లండ్ లయన్స్‌తో ఆడేందుకు భారత్ ‘ఎ’ తరఫున బరిలోకి దించాలనుకున్నాం. తద్వారా అతడి ఫిట్‌నె్‌సపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆఫర్‌ను షమి తిరస్కరించాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం తగినంత సమయం కావాలని చెప్పాడు. అంతేకానీ.. షమితో ఎలాంటి సంభాషణ జరగలేదనే కథనాలు నిజం కావు’ అని ఆ అధికారి వివరించాడు.