Sarvesh Kushare Creates History: హైజంప్ ఫైనల్‌కు సర్వేశ్
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:14 AM
ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత అథ్లెట్ సర్వేశ్ అనిల్ కుశారె హైజం్‌పలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండు గ్రూప్‌ల...
ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత అథ్లెట్ సర్వేశ్ అనిల్ కుశారె హైజం్‌పలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండు గ్రూప్‌ల నుంచి ఓవరాల్‌గా సంయుక్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షి్‌పలో హైజంప్ ఫైనల్ చేరిన తొలి భారత అథ్లెట్‌గా 30 ఏళ్ల సర్వేశ్ రికార్డు సృష్టించాడు. ఇక, పురుషుల 10వేల మీటర్ల రేస్‌లో పోటీపడ్డ గుల్వీర్ సింగ్ 29 నిమిషాల 13.33 సెకన్ల టైమింగ్‌తో 16వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.