విడిపోయిన సైనా కశ్యప్
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:04 AM
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోయినట్టు ప్రకటించింది. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది...
సోషల్ మీడియాలో నెహ్వాల్ ప్రకటన
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోయినట్టు ప్రకటించింది. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘జీవితం ఒక్కోసారి మనల్ని భిన్నమైన మార్గాల వైపు నడిపిస్తుంటుంది. ఎంతో ఆలోచించి, చర్చించుకొన్న తర్వాత ఇద్దరం కలసి ఉండలేమని నిర్ణయించుకొన్నట్టు’ సైనా రాసింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరింది. షట్లర్లయిన సైనా, కశ్య్‌పలు 2018లో ప్రేమ వివాహం చేసుకొన్నారు. గోపీచంద్ అకాడమీలోనే వీరిద్దరూ శిక్షణ పొందారు. నెహ్వాల్ ఒలింపిక్ పతకంతోపాటు టాప్ ర్యాంక్‌కు చేరుకోగా.. కశ్యప్ 2014లో కామన్వెల్త్ స్వర్ణం సాధించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి