Share News

జంతు కళేబరాల మధ్యే సాధన

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:19 AM

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, పరిరక్షణ గురించి చాలా రోజులుగా పాలకుల నుంచి ప్రకటనలు వింటూనే ఉన్నాం కానీ ఇప్పటికీ సాగర్‌ రూపురేఖలు మారలేదు. సాగర్‌లో ప్రతి ఏటా...

జంతు కళేబరాల మధ్యే సాధన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, పరిరక్షణ గురించి చాలా రోజులుగా పాలకుల నుంచి ప్రకటనలు వింటూనే ఉన్నాం కానీ ఇప్పటికీ సాగర్‌ రూపురేఖలు మారలేదు. సాగర్‌లో ప్రతి ఏటా సెయిలింగ్‌ జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరుగుతుం టాయి. అయితే, సోమవారం ఉదయం హుస్సేన్‌సాగర్‌లో విస్తుపోయే సంఘటన జరిగింది. మరో ఐదు రోజుల్లో ఇక్కడ జాతీయ సెయిలింగ్‌ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రాలకు చెందిన పలువురు సెయిలర్లు ముమ్మరంగా సాధన చేస్తూ కనిపించారు. కానీ, ఇటీవల కురుస్తున్న వర్షాలకు జంతు కళేబరాలు సాగర్‌లోకి కొట్టుకురావడంతో సెయిలర్లు వాటి మధ్యే సాధన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సెయిలర్లు సాధన చేస్తున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే కళేబరాలు ఉండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి ఇదే పరిస్థితని, ఇప్పటికైనా సంబంధిత విభాగాల ప్రభుత్వ అధికారులు సాగర్‌ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడాకారులు కోరుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:19 AM