Share News

గుజరాత్‌ గెలుపు జోరు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:11 AM

ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు జోరును కొనసాగిస్తోంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82)తోపాటు బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో...

గుజరాత్‌ గెలుపు జోరు

ఐపీఎల్‌లో నేడు

బెంగళూరు X ఢిల్లీ

వేదిక : బెంగళూరు, రా.7.30

సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82)

మెరిసిన సుదర్శన్‌

58 పరుగులతో రాజస్థాన్‌ చిత్తు

వరుస విజయాలతో దుమ్మురేపుతున్న గుజరాత్‌ టైటాన్స్‌.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన టైటాన్స్‌.. వరుసగా నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకొంది. సాయి సుదర్శన్‌ క్లాసిక్‌ ఆటతో భారీ స్కోరు చేసిన గుజరాత్‌.. బంతితోనూ రాయల్స్‌ పనిబట్టింది.


అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ గెలుపు జోరును కొనసాగిస్తోంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82)తోపాటు బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌ గుజరాత్‌ 58 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించింది. తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. బట్లర్‌ (36), షారుక్‌ ఖాన్‌ (20 బంతుల్లో 36) రాణించారు. తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. హెట్‌ మయర్‌ (52), సంజూ శాంసన్‌ (41) శ్రమ వృథా అయింది. ప్రసిద్ధ్‌ కృష్ణ 3, సాయి కిశోర్‌, రషీద్‌ చెరో 2 వికెట్లు తీశారు.

బ్యాటర్లు విఫలం: ఛేదన ఆరంభంలోనే జైస్వాల్‌ (6), నితీశ్‌ రాణా (1) వికెట్లను చేజార్చుకొన్న రాజస్థాన్‌.. ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. టైటాన్స్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ.. స్కోరుబోర్డుకు పగ్గాలేశారు. జైస్వాల్‌ను అర్షద్‌ అవుట్‌ చేయగా.. రాణాను సిరాజ్‌ బోల్తాకొట్టించాడు. కానీ, కెప్టెన్‌ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌ (26) మూడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, పరాగ్‌ను కేజ్రోలియా.. ధ్రువ్‌ జురెల్‌ (5) రషీద్‌ వెనక్కిపంపడంతో రాజస్థాన్‌ 68/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో శాంసన్‌, హెట్‌మయర్‌ ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. కానీ, వీరిద్దరినీ కృష్ణ అవుట్‌ చేయడంతో రాజస్థాన్‌ పోరాటం ముగిసింది.


నడిపించిన సుదర్శన్‌: ఓపెనర్‌ సుదర్శన్‌ కళాత్మక అర్ధ శతకంతో ముందుండి నడిపించడంతో.. గుజరాత్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ను ఆర్చర్‌ ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2)ను స్వల్ప స్కోరుకే అవుట్‌ చేశాడు. కానీ, బట్లర్‌తో కలసి రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేసిన సుదర్శన్‌.. మూడో వికెట్‌కు షారుఖ్‌తో కలసి 62 పరుగులు జోడించడంతో టైటాన్స్‌ భారీ స్కోరు చేసింది. దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో సుదర్శన్‌ 18 పరుగులు రాబట్టాడు. కానీ, మరో ఎండ్‌లో బట్లర్‌ ఆచితూచి ఆడడంతో.. ఆరు ఓవర్లకు టైటాన్స్‌ 56/1తో నిలిచింది. క్రీజులో కుదురుకొన్న బట్లర్‌.. ఫరూకీ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పాడు. అయితే, 10వ ఓవర్‌లో తీక్షణ బౌలింగ్‌లో సింగిల్‌తో సుదర్శన్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నా.. అదే ఓవర్‌లో బట్లర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో షారుక్‌ క్రీజులోకి రావడంతో స్కోరు బోర్డు ఊపందుకొంది. రెండు వరుస బౌండ్రీలతో బ్యాట్‌కు పనిచెప్పిన షారుక్‌.. తుషార్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదాడు. ఇక, తీక్షణ బౌలింగ్‌లో 6,4,4తో చెలరేగిన షారుక్‌.. డెత్‌ ఓవర్లలో విజృంభిస్తాడనుకొంటే స్టంపౌటయ్యాడు. రూథర్‌ఫోర్డ్‌ (6)ను సందీప్‌ పెవిలియన్‌ చేర్చగా.. సుదర్శన్‌, రషీద్‌ (12)లను దేశ్‌పాండే అవుట్‌ చేశాడు. కానీ, చివరి ఓవర్‌లో ధాటిగా ఆడిన తెవాటియా (24 నాటౌట్‌) టీమ్‌ స్కోరును 220కి చేరువ చేశాడు.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) శాంసన్‌ (బి) దేశ్‌పాండే 82, గిల్‌ (బి) ఆర్చర్‌ 2, బట్లర్‌ (ఎల్బీ) తీక్షణ 36, షారుక్‌ ఖాన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తీక్షణ 36, రూథర్‌ఫర్డ్‌ (సి) శాంసన్‌ (బి) సందీప్‌ 7, తెవాటియా (నాటౌట్‌) 24, రషీద్‌ (సి) జైస్వాల్‌ (బి) దేశ్‌పాండే 12, అర్షద్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 217/6; వికెట్ల పతనం: 1-14, 2-94, 3-156, 4-163, 5-187, 6-201; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-30-1, ఫరూఖి 4-0-38-0, తుషార్‌ దేశ్‌పాండే 4-0-53-2, సందీప్‌ శర్మ 4-0-41-1, తీక్షణ 4-0-54-2.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) రషీద్‌ (బి) అర్షద్‌ 6, సంజూ శాంసన్‌ (సి) సాయి కిషోర్‌ (బి) ప్రసిద్ధ్‌ 41, నితీశ్‌ రాణా (సి) ఖేజ్రోలియా (బి) సిరాజ్‌ 1, పరాగ్‌ (సి) బట్లర్‌ (బి) ఖేజ్రోలియా 26, జురెల్‌ (సి) సాయి సుదర్శన్‌ (బి) రషీద్‌ 5, హెట్‌మయెర్‌ (సి) సాయి కిషోర్‌ (బి) ప్రసిద్ధ్‌ 52, శుభమ్‌ దూబే (ఎల్బీ) రషీద్‌ 1, ఆర్చర్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 4, తీక్షణ (సి) సాయి సుదర్శన్‌ (బి) సాయి కిషోర్‌ 5, తుషార్‌ దేశ్‌పాండే (సి) రషీద్‌ (బి) సాయి కిషోర్‌ 3, సందీప్‌ శర్మ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.2 ఓవర్లలో 159 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-10, 2-12, 3-60, 4-68, 5-116, 6-119, 7-144, 8-145, 9-150, 10-159; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-30-1, అర్షద్‌ 2-0-19-1, ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-24-3, కుల్వంత్‌ ఖేజ్రోలియా 3-0-29-1, రషీద్‌ 4-0-37-2, సాయి కిషోర్‌ 2.2-0-20-2.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 5 4 1 0 8 1.413

ఢిల్లీ 3 3 0 0 6 1.257

బెంగళూరు 4 3 1 0 6 1.015

పంజాబ్‌ 4 3 1 0 6 0.289

లఖ్‌నవూ 5 3 2 0 6 0.078

కోల్‌కతా 5 2 3 0 4 -0.056

రాజస్థాన్‌ 5 2 3 0 4 -0.733

ముంబై 5 1 4 0 2 -0.010

చెన్నై 5 1 4 0 2 -0.889

హైదరాబాద్‌ 5 1 4 0 2 -1.629

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవి కూడా చదవండి..

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి యాడ్స్, ప్రమోషన్స్ తొలగింపు.. కారణం ఏంటి

IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 03:11 AM