సబలెంకాదే ‘మాడ్రిడ్’ కిరీటం
ABN , Publish Date - May 05 , 2025 | 04:34 AM
ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణి అరియానా సబలెంకా మాడ్రిడ్ ఓపెన్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో...
మాడ్రిడ్: ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణి అరియానా సబలెంకా మాడ్రిడ్ ఓపెన్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సబలెంకా (బెలారస్) 6-3, 7-6 (3)తో అమెరికా స్టార్ కొకొ గాఫ్‌ను ఓడించి ఈ వేదికపై మూడోసారి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో మూడుసార్లు ఈ టైటిల్ నెగ్గిన పెట్రా క్విటోవా రికార్డును సమం చేసింది. కాగా, సబలెంకాకు ఇది కెరీర్‌లో 20వ టైటిల్.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..