Ruturaj Gaikwad: రుతురాజ్ భారీ శతకం
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:48 AM
రుతురాజ్ గైక్వాడ్ 184 శతక సహాయంతో వెస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. దులీప్ ట్రోఫీలో భాగంగా..
బెంగళూరు: రుతురాజ్ గైక్వాడ్ (184) శతక సహాయంతో వెస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ సెమీ్‌సలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 363/6 స్కోరుతో నిలిచింది. నార్త్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీ్‌సలో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 297/3 స్కోరు సాధించింది. ఓపెనర్ ఎన్.జగదీశన్ (148 బ్యాటింగ్) అజేయ శతకంతో నిలిచాడు.