Share News

కౌంటీల్లో రుతురాజ్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:08 AM

ప్రస్తుతం భారత్‌-ఎ జట్టుతో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ త్వరలోనే అక్కడ కౌంటీ చాంపియన్‌షిప్‌లో...

కౌంటీల్లో రుతురాజ్‌

లీడ్స్‌ (ఇంగ్లండ్‌): ప్రస్తుతం భారత్‌-ఎ జట్టుతో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ త్వరలోనే అక్కడ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ఇంగ్లండ్‌ కౌంటీల్లోని యార్క్‌షైర్‌ జట్టుతో రుతురాజ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌తో భారత్‌-ఎ జట్టు ఆడిన రెండు అనధికారిక టెస్టుల్లో రుతురాజ్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఈనెల 13 నుంచి 16 వరకు భారత సీనియర్‌ జట్టుతో నాలుగురోజుల మ్యాచ్‌ ఆడతాడు. ఆ తర్వాత యార్క్‌షైర్‌ జట్టుతో చేరనున్న రుతురాజ్‌.. అక్కడి కౌంటీ చాంపియన్‌షి్‌పలో ఐదు మ్యాచ్‌ల్లో పాల్గొంటాడు. ఆ తర్వాత వన్డే కప్‌లోనూ ఆడతాడు.

ఇవీ చదవండి:

రింకూతో భువీ డ్యాన్స్

అమ్మకానికి ఆర్సీబీ?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 01:08 AM