Share News

Rohit Sharma: ఈ గౌరవాన్ని ఊహించలేదు

ABN , Publish Date - May 17 , 2025 | 01:48 AM

రోహిత్‌ శర్మ పేరు మీద వాంఖడే స్టేడియంలో స్టాండ్‌ను ఆవిష్కరించడం మహా గౌరవంగా నిలిచింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్‌ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

Rohit Sharma: ఈ గౌరవాన్ని ఊహించలేదు

  • వాంఖడేలో స్టాండ్‌ ఆవిష్కరణపై రోహిత్‌

ముంబై: రోహిత్‌ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. వాంఖడే స్టేడియంలో అతడి పేరిట నెలకొల్పిన స్టాండ్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు రోహిత్‌ తల్లిదండ్రులు, భార్య రితిక హాజరయ్యారు. శరద్‌ పవార్‌, అజిత్‌ వాడేకర్‌ల పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్‌.. ‘ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదు. చిన్నతనంలో ముంబై, భారత జట్టుకు ఆడాలని కోరుకున్నా కానీ, వీటి గురించి ఆలోచించలేదు. వాంఖడే స్టేడియంతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల మధ్య నా పేరు ఉండడాన్ని మాటల్లో వర్ణించలేను. 21న ఢిల్లీతో మ్యాచ్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేక అనుభూతి దక్కనుంద’ని అన్నాడు.

Updated Date - May 17 , 2025 | 01:49 AM