Share News

Rohit Sharma: అప్పుడు గుండె ఆగినంత పనైంది..

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:20 AM

భారత జట్టు రెండో టీ20 ప్రపంచక్‌పను సాధించి ఈనెల 29కి ఏడాది పూర్తయ్యింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాటి ఫైనల్లో భారత్‌ విశ్వకప్‌ గెల్చుకుంది. ఆ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో...

Rohit Sharma: అప్పుడు గుండె ఆగినంత పనైంది..
Rohit Sharma

న్యూఢిల్లీ: భారత జట్టు రెండో టీ20 ప్రపంచక్‌పను సాధించి ఈనెల 29కి ఏడాది పూర్తయ్యింది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాటి ఫైనల్లో భారత్‌ విశ్వకప్‌ గెల్చుకుంది. ఆ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ బౌండరీ లైన్‌ దగ్గర చక్కగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ పట్టిన క్యాచ్‌ అత్యంత ముఖ్యమైంది. అయితే ఆ క్యాచ్‌ రివ్యూ సమయంలో తాము పడిన ఆందోళన అంతా ఇంతా కాదని అప్పటి కెప్టెన్‌ రోహిత్‌ తెలిపాడు. ‘సూర్య క్యాచ్‌ను థర్డ్‌ అంపైర్‌ చెక్‌ చేస్తున్నప్పుడు మాకు గుండె ఆగినంత పనైంది. నిజానికి ఆ బంతి వెళ్లిన తీరుకు కచ్చితంగా బౌండరీ లైన్‌ దాటాల్సిందే.

కానీ అప్పుడు వీచిన బలమైన గాలులకు బంతి కాస్త గ్రౌండ్‌లోకి వచ్చినట్టుంది. అలాగే థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం చూసేందుకు కూడా నాకు ధైర్యం చాల్లేదు. అందుకే అవుటా? నాటౌటా? అనేది నువ్వే చూసి చెప్పు అని సూర్యతో అన్నా’ అని రోహిత్‌ గుర్తుచేసుకున్నాడు. మరోవైపు సఫారీలకు 30 బంతుల్లో 30 రన్స్‌ కావాల్సిన వేళ పంత్‌ హఠాత్తుగా మోకాలి నొప్పంటూ సైగ చేయడంతో మ్యాచ్‌ కాసేపు ఆగింది. అయితే రోహిత్‌ మాత్రం పంత్‌ది నిజమైన నొప్పే అని భావించాడట. కానీ ప్రత్యర్థి లయను దెబ్బతీసేందుకు పంత్‌ పన్నిన వ్యూహమని తర్వాత తెలిసిందని రోహిత్‌ చెప్పాడు.


ఇవీ చదవండి:

గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!

ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!

పంత్ నాటకం.. నిజం బయటపడింది!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 09:19 AM