Share News

Indian swimmer performance: స్విమ్మింగ్‌లో రోహిత్‌ జాతీయ రికార్డు

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:11 AM

భారత టీనేజ్‌ స్విమ్మర్‌ రోహిత్‌ బెనెడిక్టన్‌ జర్మనీలో జరుగుతున్న ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో జాతీయ రికార్డును తిరగ రాశాడు....

Indian swimmer performance: స్విమ్మింగ్‌లో రోహిత్‌ జాతీయ రికార్డు

న్యూఢిల్లీ: భారత టీనేజ్‌ స్విమ్మర్‌ రోహిత్‌ బెనెడిక్టన్‌ జర్మనీలో జరుగుతున్న ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో జాతీయ రికార్డును తిరగ రాశాడు. గురువారం జరిగిన పురుషుల 50 మీ. బటర్‌ఫ్లైలో 24 సెకన్లలో గమ్యం చేరిన రోహిత్‌..వీర్‌ధవల్‌ ఖడే పేరిట ఏడేళ్ల నుంచి ఉన్న రికార్డు (24.09సె.) బద్దలుగొట్టాడు. ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచిన రోహిత్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ 5-0తో మకావును చిత్తు చేసింది.

ఇవి కూడా చదవండి

ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Updated Date - Jul 18 , 2025 | 05:11 AM