Share News

Team India: వచ్చారు.. మొదలెట్టారు

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:16 AM

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో తలపడేందుకు ఇక్కడ అడుగుపెట్టిన టీమిండియా వెంటనే సాధనలోకి దిగింది. సిరీ్‌సలో భాగంగా మూడు వన్డేలు...

Team India: వచ్చారు.. మొదలెట్టారు

  • నెట్స్‌లో చెమటోడ్చిన రోహిత్‌, కోహ్లీ

పెర్త్‌: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సలో తలపడేందుకు ఇక్కడ అడుగుపెట్టిన టీమిండియా వెంటనే సాధనలోకి దిగింది. సిరీ్‌సలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్‌-ఆసీ్‌స తలపడనున్నాయి. తొలి వన్డే ఈనెల 19న జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం పెర్త్‌ చేరుకున్న టీమిండియా వెంటనే ప్రాక్టీస్‌ మొదలెట్టింది. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌, విరాట్‌ ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపారు. టెస్ట్‌లు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం విదితమే. ఈ ఫార్మాట్‌లో రో-కో చివరిసారి గత మార్చిలో చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడారు. నెట్‌ ప్రాక్టీస్‌ తర్వాత కోచ్‌ గంభీర్‌తో రోహిత్‌ చాలాసేపు సంభాషించడం ఆసక్తి రేపింది. మరోవైపు సాధనకు ముందు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడిన కోహ్లీ తర్వాత పేసర్‌ అర్ష్‌దీ్‌పతో ముచ్చటించాడు. శుక్ర, శనివారాల్లో కూడా భారత జట్టు ప్రాక్టీస్‌ చేయనుంది.

పెర్త్‌ చేరిన క్రికెటర్లు..: తొలి విడతగా బుధవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన భారత క్రికెటర్లు రోహిత్‌, కోహ్లీ, కెప్టెన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌, అర్ష్‌దీప్‌, హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌తోపాటు కొందరు సహాయ సిబ్బంది గురువారం తెల్లవారుజామున పెర్త్‌ చేరుకున్నారు. వారు ప్రయాణించిన విమానం మూడున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత కోచ్‌ గంభీర్‌, కుల్దీప్‌, అక్షర్‌, బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌, ఇతర కోచింగ్‌ సిబ్బంది పెర్త్‌ చేరుకున్నారు.


1.jpg

పెర్త్‌ పిచ్‌పై రో-కోకి కష్టమే

సుదీర్ఘ విరామం తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ భారత్‌ తరఫున బరిలోకి దిగబోతున్నారు. అయితే ఆదివారం ఆసీ్‌సతో జరిగే తొలి వన్డే ఈ ద్వయానికి సవాల్‌గా మారనుందని మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. ‘ఐపీఎల్‌లో ఆడిన తర్వాత విరాట్‌, రోహిత్‌ మళ్లీ ఇప్పుడే బ్యాట్‌ పట్టనున్నారు. అదీ బౌన్స్‌ అధికంగా ఉండే పెర్త్‌ పిచ్‌పై తొలి మ్యాచ్‌ కావడం వారికి ఇబ్బందికరమే. అయితే ఈ మూడు వన్డేలు ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల భవిష్యత్‌ను నిర్ణయించలేవు’ అని చోప్రా స్పష్టం చేశాడు. మరోవైపు విరాట్‌-రోహిత్‌లకు ఆసీస్‌ పర్యటన అంత సులువు కాదని, కుదురుకునేందుకు సమయం పడుతుందని మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. ఇక విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడేందుకు భారత యువ ఆటగాళ్లను అనుమతించాలని మాజీ కోచ్‌ రవిశాస్త్రి కోరాడు.

Updated Date - Oct 17 , 2025 | 04:16 AM