Share News

Ravindra Jadeja: భారత క్రికెటర్లు వ్యసనపరులు

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:16 AM

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్‌ రాష్ట్ర మంత్రి రివాబా భారత క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త జడేజా చాలా మంచి వ్యక్తి....

Ravindra Jadeja: భారత క్రికెటర్లు వ్యసనపరులు

  • మా ఆయన బంగారం జూ జడేజా భార్య రివాబా సంచలన వ్యాఖ్య

ద్వారక (గుజరాత్‌): ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్‌ రాష్ట్ర మంత్రి రివాబా భారత క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త జడేజా చాలా మంచి వ్యక్తి అని, ఇతర ఆటగాళ్లు మాత్రం వ్యసనపరులంటూ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో రివాబా పేర్కొంది. ‘నా భర్త జడేజా క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం లండన్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియావంటి చోట్లకు జట్టుతో పాటు వెళుతుంటారు. అక్కడ ఏమైనా చేయగల స్వేచ్ఛ అతడికుంది. కానీ తను మాత్రం ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాలేదు. బాధ్యతగా ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. అయితే జట్టులోని కొందరు ఆటగాళ్లు దురలవాట్లకు బానిసలయ్యారు. అలాగే ఈ విషయంలో వారి కుటుంబాల నుంచి కూడా ఎలాంటి ఆంక్షలు లేవు’ అని రివాబా తెలిపింది. ఎవరి పేర్లూ చెప్పకపోయినప్పటికీ.. ఆమె కామెంట్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Dec 13 , 2025 | 06:16 AM