Share News

పంత్‌.. దొంగనొప్పి!

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:00 AM

కోల్‌కతాతో మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ నెట్‌లో విమర్శల వర్షం కురుస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో..

పంత్‌.. దొంగనొప్పి!

  • నటన అద్భుతం అంటున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: కోల్‌కతాతో మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ నెట్‌లో విమర్శల వర్షం కురుస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 4 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో రహానె (61) దూకుడుగా ఆడుతుండడంతో ఒక దశలో కోల్‌కతా 149/2తో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. విజయానికి 8 ఓవర్లలో 90 పరుగులు కావాలి. ఈ క్రమంలో 13వ ఓవర్‌ బౌల్‌ చేయడానికి శార్దూల్‌ సిద్ధమైన సమయంలో.. పంత్‌ నడుం నొప్పి అంటూ మెడికల్‌ టైమవుట్‌ తీసుకొన్నాడు. దీంతో కోల్‌కతా బ్యాటర్ల ఏకాగ్రత చెదిరింది. మరోవైపు వ్యూహాత్మకంగా వైడ్‌లు వేసిన శార్దూల్‌.. రహానెను అవుట్‌ చేయడంతో తడబడిన కోల్‌కతా గెలుపు వాకిట బోల్తాపడింది. అయితే, పంత్‌ దొంగ నొప్పితో కోల్‌కతా లయను దెబ్బతీశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా జోరును అడ్డుకోవడానికి పంత్‌ ఇలాగే మోకాలి నొప్పి అంటూ నాటకం ఆడాడని గుర్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి యాడ్స్, ప్రమోషన్స్ తొలగింపు.. కారణం ఏంటి

IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 03:04 AM