Share News

Shooting World Championship: రవిందర్‌ గోల్డెన్‌ షూట్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:19 AM

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో శనివారం భారత షూటర్లు పతకాలతో సత్తా చాటారు. భారత ఆర్మీలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల రవీందర్‌ సింగ్‌ 50 మీటర్ల వ్యక్తిగత పిస్టల్‌ ఈవెంట్‌లో స్వర్ణం...

Shooting World Championship: రవిందర్‌ గోల్డెన్‌ షూట్‌

షూటింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌

  • ఎలవెనిల్‌కు కాంస్యం

కైరో: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో శనివారం భారత షూటర్లు పతకాలతో సత్తా చాటారు. భారత ఆర్మీలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల రవీందర్‌ సింగ్‌ 50 మీటర్ల వ్యక్తిగత పిస్టల్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. ఇక, 50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో కమల్జీత్‌, యోగేశ్వర్‌, రవీందర్‌లతో కూడిన భారత జట్టు రజతం నెగ్గింది. దీంతో రవీందర్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఇక, వ్యక్తిగత 10 మీటర్ల రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ కాంస్యం దక్కించుకుంది. ఇదే 10 మీటర్ల రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఎలవెనిల్‌, మేఘన, శ్రేయాలతో కూడిన భారత త్రయం కాంస్యం అందుకుంది.

Updated Date - Nov 09 , 2025 | 06:19 AM