Share News

Ranji Trophy: రషీద్‌ శతకం

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:04 AM

రషీద్‌ (140 నాటౌట్‌) సెంచరీ చేయడంతో.. ఒడిశాతో రంజీలో ఆంధ్ర భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజు 222/3తో తొలి ఇన్నింగ్స్‌ను...

Ranji Trophy: రషీద్‌ శతకం

కటక్‌: రషీద్‌ (140 నాటౌట్‌) సెంచరీ చేయడంతో.. ఒడిశాతో రంజీలో ఆంధ్ర భారీ స్కోరు చేసింది. ఆటకు రెండో రోజు 222/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 475/7 వద్ద డిక్లేర్‌ చేసింది. సౌరభ్‌ కుమార్‌ (69), శశికాంత్‌ (46) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఒడిశా 80/4 స్కోరు చేసింది. ఆదివారం ఆట ఆఖరుకు సందీప్‌ (24), గోవింద పటీదార్‌ (1) క్రీజులో ఉన్నారు. సాయితేజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

Updated Date - Nov 03 , 2025 | 04:05 AM