Share News

రాజస్థాన్‌ ఇంటికి..

ABN , Publish Date - May 02 , 2025 | 02:29 AM

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా వెనుదిరిగింది. గుజరాత్‌పై వారెవా.. అనే రీతిలో చెలరేగిన ఈ జట్టు తమ తర్వాతి మ్యాచ్‌లోనే పూర్తిగా చేతులెత్తేసింది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమై...

రాజస్థాన్‌ ఇంటికి..

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X హైదరాబాద్‌

వేదిక : అహ్మదాబాద్‌, రా.7.30 నుంచి

  • ప్లేఆఫ్స్‌ రేసు నుంచి అవుట్‌

  • 100 రన్స్‌ తేడాతో చిత్తు

  • ముంబైకి వరుసగా ఆరో విజయం

జైపూర్‌: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా వెనుదిరిగింది. గుజరాత్‌పై వారెవా.. అనే రీతిలో చెలరేగిన ఈ జట్టు తమ తర్వాతి మ్యాచ్‌లోనే పూర్తిగా చేతులెత్తేసింది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమై ముంబై ఇండియన్స్‌ చేతిలో 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకొంది. అటు తొలి ఐదు మ్యాచుల్లో నాలుగింటిని కోల్పోయిన ముంబై ఇండియన్స్‌.. ఆ తర్వాత వరుసగా ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడం విశేషం. అలాగే 14 పాయింట్లతో పట్టికలో టాప్‌నకు చేరింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రికెల్టన్‌ (61), రోహిత్‌ (53) అర్ధసెంచరీలు సాధించగా సూర్యకుమార్‌ (48 నాటౌట్‌), హార్దిక్‌ (48 నాటౌట్‌) వేగం కనబర్చారు. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. ఆర్చర్‌ (30) టాప్‌ స్కోరర్‌. కర్ణ్‌, బౌల్ట్‌లకు మూడేసి, బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రికెల్టన్‌ నిలిచాడు.


పేకమేడలా..: తమ చివరి మ్యాచ్‌లో 210 పరుగులను 15.5 ఓవర్లలోనే పూర్తి చేసిన రాజస్థాన్‌.. ఈసారి 217 పరుగుల ఛేదనలో అతికష్టంగా 100 పరుగులను దాటించి 16.1 పరుగులకే కుప్పకూలింది. కానీ అంతకుముందు ఈ లక్ష్య ఛేదనలో 14 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ పటిష్ట బౌలింగ్‌ లైనప్‌ కలిగిన ముంబైని ఎలా ఎదుర్కొంటాడోనని అంతా ఎదురుచూశారు. కానీ ఎలాంటి అద్భుతాలూ జరుగలేదు. తొలి ఓవర్‌లోనే వైభవ్‌ను పేసర్‌ చాహర్‌ డకౌట్‌గా పంపి ఆర్‌ఆర్‌కు షాకిచ్చాడు. ఇక రెండు సిక్సర్లతో జోరు మీదున్న జైస్వాల్‌ (13), రాణా (9)లను బౌల్ట్‌ అవుట్‌ చేయగా.. ఆ తర్వాత బుమ్రా వరుస బంతుల్లో పరాగ్‌ (16), హెట్‌మయెర్‌ (0)ల పనిబట్టాడు. దీంతో ఐదు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే రాజస్థాన్‌ 47/5 స్కోరుతో నిలిచింది. అయినా పవర్‌ప్లేలో జట్టు 62 పరుగులు సాధించడం గమనార్హం. మిగిలిన ఆటగాళ్లను కూడా ముంబై బౌలర్లు చకచకా అవుట్‌ చేయడంతో 12 ఓవర్లలోనే 91/9 స్కోరుతో నిలిచింది. చివర్లో ఆకాశ్‌ (4 నాటౌట్‌)ను అండగా చేసుకుని ఆర్చర్‌ చెలరేగడంతో కనీసం వంద పరుగులైనా దాటగలిగింది. 17వ ఓవర్‌ తొలి బంతికి ఆర్చర్‌ను బౌల్ట్‌ అవుట్‌ చేయడంతో 23 బాల్స్‌ ఉండగానే ఆర్‌ఆర్‌ ఆట ముగిసింది.


ఓపెనర్ల శతక భాగస్వామ్యం: ముంబై ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన నలుగురు బ్యాటర్లూ చెలరేగారు. రికెల్టన్‌-రోహిత్‌ జోడీ కచ్చితమైన షాట్లతో ఎదురుదాడికి దిగి తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అలాగే చివరి ఐదు ఓవర్లలో సూర్య, హార్దిక్‌ల ప్రతాపంతో 71 పరుగులు రాబట్టింది. రెండో ఓవర్‌లోనే రోహిత్‌ను ఎల్బీగా ప్రకటించినా.. రివ్యూకు వెళ్లి బతికిపోయాడు. పవర్‌ప్లేలో జట్టు 58 పరుగులకు చేరింది. అయితే ప్రమాదకరంగా మారిన ఓపెనింగ్‌ జోడీని వరుస ఓవర్లలో రాజస్థాన్‌ బౌలర్లు పెవిలియన్‌కు చేర్చారు. 12వ ఓవర్‌లో రికెల్టన్‌ను తీక్షణ బౌల్డ్‌ చేయగా.. అర్ధసెంచరీ పూర్తి చేసిన రోహిత్‌ను పరాగ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బాధ్యతను సూర్యకుమార్‌, హార్దిక్‌ తీసుకోవడంతో ఆర్‌ఆర్‌ బౌలర్లకు ఫలితం దక్కలేదు. ఆర్చర్‌ కాస్త కట్ట్టడి చేసినా ఆఖరి ఓవర్‌లో మరో 13 పరుగులతో స్కోరు 210+ దాటగలిగింది. ఈ జోడీ మధ్య మూడో వికెట్‌కు అజేయంగా 94 పరుగులు జత చేరాయి.


స్కోరుబోర్డు

ముంబై: రికెల్టన్‌ (బి) తీక్షణ 61; రోహిత్‌ (సి) జైస్వాల్‌ (బి) పరాగ్‌ 53; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 48; హార్దిక్‌ (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 217/2. వికెట్ల పతనం: 1-116, 2-123; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-42-0; ఫరూఖి 4-0-54-0; తీక్షణ 4-047-1; కార్తికేయ 2-0-22-0; ఆకాశ్‌ 4-0-39-0; పరాగ్‌ 2-0-12-1.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (బి) బౌల్ట్‌ 13, వైభవ్‌ సూర్యవంశీ (సి) జాక్స్‌ (బి) చాహర్‌ 0, రాణా (సి) తిలక్‌ (బి) బౌల్ట్‌ 9, పరాగ్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 16, జురెల్‌ (సి) అండ్‌ (బి) కర్ణ్‌ శర్మ 11, హెట్‌మయెర్‌ (సి) సూర్య (బి) బుమ్రా 0, శుభమ్‌ దూబే (సి) బౌల్ట్‌ (బి) హార్దిక్‌ 15, ఆర్చర్‌ (సి) బుమ్రా (బి) బౌల్ట్‌ 30, తీక్షణ (సి) సూర్య (బి) కర్ణ్‌ శర్మ 2, కార్తికేయ (సి) చాహర్‌ (బి) కర్ణ్‌ శర్మ 2, ఆకాశ్‌ మధ్వాల్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: 16.1 ఓవర్లలో 117 ఆలౌట్‌; వికెట్లపతనం: 1-1, 2-18, 3-41, 4-47, 5-47, 6-64, 7-76, 8-87, 9-91, 10-117; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 2-0-13-1, బౌల్ట్‌ 2.1-0-28-3, బుమ్రా 4-0-15-2, బాష్‌ 3-0-29-0, హార్దిక్‌ పాండ్యా 1-0-2-1, కర్ణ్‌ శర్మ 4-0-23-3.


ప్రతీ సిక్సర్‌తో ఆరు గృహాలకు విద్యుత్‌

ముంబైతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ జట్టు పూర్తి గులాబీ రంగు జెర్సీలతో ఆడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సాధికారతకు మద్దతుగా ఆర్‌ఆర్‌ ‘పింక్‌ ప్రామిస్‌’ క్యాంపెయిన్‌ నిర్వహిస్తుండగా.. దీంట్లో భాగంగానే జట్టంతా పూర్తి పింక్‌లోకి మారింది. అలాగే రాజస్థాన్‌లో మహిళల ఆధ్వర్యంలో నడిచే గ్రామాల అభివృద్ధికి ప్రతీ టిక్కెట్‌ ధర నుంచి రూ.100లను విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా మ్యాచ్‌లో నమోదయ్యే ఒక్కో సిక్సర్‌కు ఆరు ఇళ్లచొప్పున సంభార్‌ ప్రాంతంలోని సౌరశక్తితో కరెంట్‌ను అందివ్వబోతున్నట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫౌండేషన్‌ పేర్కొంది.

1

ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ నలుగురు బ్యాటర్లు 45+ రన్స్‌ సాధించడం ఇదే తొలిసారి.

2

టీ20ల్లో ఒకే జట్టు తరఫున ఎక్కువ పరుగులు (ముంబై, 6024) చేసిన రెండో బ్యాటర్‌గా రోహిత్‌. విరాట్‌ (ఆర్‌సీబీ, 8871) టాప్‌లో ఉన్నాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

ముంబై 11 7 4 0 14 1.274

బెంగళూరు 10 7 3 0 14 0.521

పంజాబ్‌ 10 6 3 1 13 0.199

గుజరాత్‌ 9 6 3 0 12 0.748

ఢిల్లీ 10 6 4 0 12 0.362

లఖ్‌నవూ 10 5 5 0 10 -0.325

కోల్‌కతా 10 4 5 1 9 0.271

రాజస్థాన్‌ 11 3 8 0 6 -0.780

హైదరాబాద్‌ 9 3 6 0 6 -1.103

చెన్నై 10 2 8 0 4 -1.211

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 02:29 AM