Share News

Rahul Radhesh Century: రాధేష్‌ సెంచరీ

ABN , Publish Date - Nov 10 , 2025 | 05:25 AM

రాహుల్‌ రాధేష్‌ 129 సెంచరీతో ఆదుకోవడంతో.. గ్రూప్‌-డిలో రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ మెరుగైన స్కోరు సాధించింది...

Rahul Radhesh Century: రాధేష్‌ సెంచరీ

హైదరాబాద్‌: రాహుల్‌ రాధేష్‌ (129) సెంచరీతో ఆదుకోవడంతో.. గ్రూప్‌-డిలో రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ మెరుగైన స్కోరు సాధించింది. ఆటకు రెండో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 295/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 364 పరుగులకు ఆలౌటైంది. క్రితంరోజు బ్యాటర్‌ రోహిత్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌ చాహర్‌, అశోక్‌ శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 221/5 స్కోరు చేసింది. ఆదివారం ఆట ఆఖరుకు కునాల్‌ సింగ్‌ (64 బ్యాటింగ్‌), అజయ్‌ సింగ్‌ (42 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తనయ్‌, అనికేత్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. హైదరాబాద్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు రాజస్థాన్‌ ఇంకా 143 పరుగులు వెనుకంజలో ఉంది.

Updated Date - Nov 10 , 2025 | 05:25 AM