Wrestling Championship: వరల్డ్ చాంపియన్లు రచన, అశ్విని
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:19 AM
భారత్‌కు చెందిన రచన, అశ్వినీ విష్ణోయ్ అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్లుగా నిలిచారు. గురువారం జరిగిన 43 కి.
ఏథెన్స్ : భారత్‌కు చెందిన రచన, అశ్వినీ విష్ణోయ్ అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్లుగా నిలిచారు. గురువారం జరిగిన 43 కి. ఫైనల్లో రచన 3-0తో జిన్ హాంగ్ (చైనా)ను చిత్తు చేసి పసిడి పతకం కైవసం చేసుకుంది. 65కి. తుదిపోరులో అశ్విని కూడా 3-0తోనే ముఖయో (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గి స్వర్ణ పతకం దక్కించుకుంది. కజకిస్థాన్ రెజ్లర్ మధ్కియాతో 57 కి. విభాగం తుది పోరులో 5-6తో ఓడిన మోనీ రజత పతకం అందుకుంది. 49కి.లలో కోమల్ వర్మ కాంస్యం సొంతం చేసుకుంది.