రబాడ తీసుకుంది కొకైన్
ABN , Publish Date - May 12 , 2025 | 05:50 AM
దక్షిణాఫ్రికా పేసర్ రబాడ నిషేధిత ఉత్ర్పేరకం వాడ డంతో ఇటీవల అతడిపై తాత్కాలిక నిషేధం పడింది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభంలోనే అతడు స్వదేశానికి...
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేసర్ రబాడ నిషేధిత ఉత్ర్పేరకం వాడ డంతో ఇటీవల అతడిపై తాత్కాలిక నిషేధం పడింది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభంలోనే అతడు స్వదేశానికి వెళ్లిపోయాడు. కానీ, కేవలం నెలరోజుల సస్పెన్షన్ విధించడంతో రబాడ వెంటనే ఐపీఎల్‌కు తిరిగొచ్చాడు. దీంతో అతను తీసుకున్న డ్రగ్ ఏమిటన్నది అప్పట్లో తెలియకపోయినా, అది కొకైన్ అంటూ అక్కడి మీడియా తాజాగా బయటపెట్టింది. సౌతాఫ్రికా 20 లీగ్‌లో జనవరి 21న అతడి మ్యాచ్ ముగిశాక అధికారులు సేకరించిన యూరిన్ శాంపిల్‌లో కొకైన్ ఆనవాళ్లు కనిపించాయట. కాగా, అతను ఆ డ్రగ్‌ను పోటీలకు ముందే తీసుకున్నాడని, మ్యాచ్‌కు ముందు కాదని రబాడ లీగల్ టీమ్ వాదించింది. అలాగే మిల్లీలీటర్‌కు వెయ్యి నానోగ్రామ్స్‌కన్నా తక్కువ స్థాయిలో డ్రగ్ ఆనవాళ్లు అతడి శాంపిల్‌లో కనిపించాయి. అందుకే తక్కువ నిషేధంతో బయటపడ్డాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..