సింధు ముందుకు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:58 AM
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-15, 21-19తో ఎస్తర్ వర్దాయో (ఇండోనేసియా)పై గెలిచి...

ప్రణయ్, లక్ష్య, ఆకర్షి ఇంటికి
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-15, 21-19తో ఎస్తర్ వర్దాయో (ఇండోనేసియా)పై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరింది. ఇక, పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ పోరాటం తొలిరౌండ్‌కే పరిమితమైంది. ప్రణయ్ 16-21, 21-12, 11-21తో జు గువాంగ్ లూ (చైనా) చేతిలో, లక్ష్య సేన్ 18-21, 10-21తో లీ చియా హావో (చైనా) చేతిలో ఓడా రు. కాగా, యువ షట్లర్లు కిరణ్ జార్జ్ 21-16, 21-8తో దిమిత్రీ పనారిన్ (కజకిస్థాన్)పై, ప్రియాన్షు రజావత్ 20-22, 21-12, 21-10తో కంటపాన్ వాంగ్‌చరోన్ (థాయ్‌లాండ్)పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు.