పంజాబ్ దూకుడు
ABN , Publish Date - May 05 , 2025 | 04:58 AM
అన్ని విభాగాల్లో రాణిస్తూ అత్యంత పటిష్ఠంగా కనిపిస్తున్న పంజాబ్ కింగ్స్ నుంచి మరో అద్భుత ప్రదర్శన. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 91) తుఫాన్ ఆటతీరుతో విరుచుకుపడగా...
నేటి మ్యాచ్
సన్‌రైజర్స్ X ఢిల్లీ
వేదిక : హైదరాబాద్, రా.7.30 నుంచి
37 రన్స్ తేడాతో లఖ్‌నవూ ఓటమి
ప్రభ్‌సిమ్రన్ సూపర్ ఇన్నింగ్స్
అర్ష్‌దీ్‌పనకు మూడు వికెట్లు
ప్రభ్‌సిమ్రన్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 91)
ధర్మశాల: అన్ని విభాగాల్లో రాణిస్తూ అత్యంత పటిష్ఠంగా కనిపిస్తున్న పంజాబ్ కింగ్స్ నుంచి మరో అద్భుత ప్రదర్శన. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 91) తుఫాన్ ఆటతీరుతో విరుచుకుపడగా.. పేసర్ అర్ష్‌దీప్ (4-0-16-3) పొదుపైన బౌలింగ్‌కు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బెంబేలెత్తింది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ సేన 37 పరుగులతో ఘనవిజయం అందుకుంది. దీంతో ఏడు విజయాలు, 15 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. తమకు మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్కటి నెగ్గినా.. పంజాబ్ ప్లేఆ్‌ఫ్సకు చాన్స్ ఉంటుంది. అటు లఖ్‌నవూ రాబోయే మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), శశాంక్ (15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 నాటౌట్) రాణించారు. ఆకాశ్, దిగ్వేష్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులకే పరిమిత మైంది. ఆయుష్ బదోని (40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 74), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45) మాత్రమే ఆకట్టుకున్నారు. అర్ష్‌దీ్‌పనకు 3, అజ్మతుల్లాకు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ప్రభ్‌సిమ్రన్ నిలిచాడు.
బదోని-సమద్ పోరాటం: భారీ ఛేదనలో లఖ్‌నవూ ఆరంభంలోనే చతికిలపడింది. టాపార్డర్ పేలవ ఆటతీరుతో జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేకపోయింది. చివర్లో బదోని, సమద్ పోరాటం ఏమాత్రం సరిపోలేదు. కెప్టెన్ రిషభ్ పంత్ (18) నిరాశాజనక ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఓపెనర్లు మార్ష్ (0), మార్‌క్రమ్ (13)లను పేసర్ అర్ష్‌దీప్ మూడో ఓవర్‌లోనే అవుట్ చేయడంతో జట్టుకు గట్టి ఝలక్ తగిలింది. తన మరుసటి ఓవర్‌లోనే ప్రమాదకర పూరన్ (6)ను కూడా అర్ష్‌దీప్ వెనక్కిపంపడంతో 27/3 స్కోరుతో లఖ్‌నవూ కష్టాల్లో పడింది. దీనికి తోడు పేసర్ అజ్మతుల్లా పంత్, మిల్లర్ (11)లకు చెక్ పెట్టాడు. పది ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయిన వేళ యువ ఆటగాళ్లు బదోని, సమద్ తెగువ చూపారు. 12వ ఓవర్‌లో బదోని 6,4,4.. సమద్ 6తో 21 పరుగులు వచ్చాయి. చాహల్ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన సమద్.. స్టొయినిస్ ఓవర్‌లో 4,6తో సత్తా చాటాడు. చివరకు జాన్సన్ రిటర్న్ క్యాచ్‌తో సమద్ వెనుదిరగ్గా ఆరో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బదోని మాత్రం ధాటిని కొనసాగిస్తూ 18వ ఓవర్‌లో 6,6,4తో 18 రన్స్ అందించాడు. కానీ చివరి ఓవర్‌లో 49 రన్స్ కావాల్సిన వేళ.. తొలి బంతికే బదోని అద్భుత ఇన్నింగ్స్ ముగియడంతో లఖ్‌నవూ చేసేదేమీ లేకపోయింది.
చెలరేగిన ప్రభ్‌సిమ్రన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ అంతా తానై కదం తొక్కించాడు. ఆరంభంలో ఇన్‌గ్లి్‌స, మిడిలార్డర్‌లో శ్రేయాస్ అతడికి సహకారం అందించారు. ఇక చివర్లో శశాంక్ జత కలవడంతో స్కోరు అవలీలగా 220 దాటేసింది. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (1) తొలి ఓవర్‌లోనే అవుటైనా.. ఇన్‌గ్లి్‌స వచ్చీ రావడంతోనే 4,6,6,6తో ధాటిని చూపాడు. నాలుగో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ 6,6,4తో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఇన్‌గ్లి్‌సను ఆకాశ్ అవుట్ చేయగా, ఆరో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ క్యాచ్‌ను పూరన్ వదిలేశాడు. అయితే పవర్‌ప్లేలో జట్టు 66/2తో పటిష్ట స్థితిలోనే నిలిచింది. అలాగే మధ్య ఓవర్లలో అడపాదడపా బౌండరీలతో ప్రభ్‌సిమ్రన్-శ్రేయాస్ జోడీ జోరు కనబర్చింది. అటు 30 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే శ్రేయా్‌సను స్పిన్నర్ దిగ్వేష్ వెనక్కి పంపడంతో మూడో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నేహల్ వధేరా (16) నిరాశపర్చగా.. శశాంక్ ఆఖర్లో వేగం చూపాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో శశాంక్ 4,4.. ప్రభ్‌సిమ్రన్ 6,4,6తో 26 పరుగులు సమకూరాయి. కానీ సెంచరీకి చేరువలో ప్రభ్‌సిమ్రన్‌ను దిగ్వేష్ క్యాచవుట్ చేశాడు. దీంతో ఐదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్‌లో 18 రన్స్‌తో పంజాబ్ స్కోరు 230 దాటింది.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (సి) మయాంక్ (బి) ఆకాశ్ 1, ప్రభ్‌సిమ్రన్ (సి) పూరన్ (బి) దిగ్వేష్ రాఠి 91, ఇన్‌గ్లిస్ (సి) మిల్లర్ (బి) ఆకాశ్ 30, శ్రేయాస్ (సి) మయాంక్ (బి) దిగ్వేష్ రాఠి 45, నేహల్ (బి) ప్రిన్స్ 16, శశాంక్ (నాటౌట్) 33, స్టొయినిస్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 236/5; వికెట్ల పతనం: 1-2, 2-50, 3-128, 4-162, 5-216; బౌలింగ్: ఆకాశ్ సింగ్ 4-0-30-2, మయాంక్ 4-0-60-0, అవేశ్ ఖాన్ 4-0-57-0, దిగ్వేష్ రాఠి 4-0-46-2, ప్రిన్స్ యాదవ్ 4-0-43-1.
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (బి) అర్ష్‌దీప్ 13, మార్ష్ (సి) నేహల్ (బి) అర్ష్‌దీప్ 0, పూరన్ (ఎల్బీ) అర్ష్‌దీప్ 6, పంత్ (సి) శశాంక్ (బి) అజ్మతుల్లా 18, బదోని (సి) అర్ష్‌దీప్ (బి) చాహల్ 74, మిల్లర్ (సి) శశాంక్ (బి) అజ్మతుల్లా 11, అబ్దుల్ (సి అండ్ బి) జాన్సెన్ 45, అవేశ్ (నాటౌట్) 19, ప్రిన్స్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 199/7; వికెట్ల పతనం: 1-15, 2-16, 3-27, 4-58, 5-73, 6-154, 7-188; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-16-3, జాన్సెన్ 4-0-31-1, అజ్మతుల్లా 4-0-33-2, చాహల్ 4-0-50-1, వైశాఖ్ 3-0-49-0, స్టొయినిస్ 1-0-17-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
బెంగళూరు 11 8 3 0 16 0.482
పంజాబ్ 11 7 3 1 15 0.376
ముంబై 11 7 4 0 14 1.274
గుజరాత్ 10 7 3 0 14 0.867
ఢిల్లీ 10 6 4 0 12 0.362
కోల్‌కతా 11 5 5 1 11 0.249
లఖ్‌నవూ 11 5 6 0 10 -0.469
రాజస్థాన్ 12 3 9 0 6 -0.718
హైదరాబాద్ 10 3 7 0 6 -1.192
చెన్నై 11 2 9 0 4 -1.117
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..