పదేళ్ల తర్వాత
ABN , Publish Date - May 19 , 2025 | 04:13 AM
లెఫ్టామ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ (3/22) కీలక వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70)...
నేటి మ్యాచ్
హైదరాబాద్ X లఖ్‌నవూ
వేదిక : లఖ్‌నవూ, రా.7.30 నుంచి
ప్లేఆఫ్స్‌కు పంజాబ్
10 పరుగులతో ఓడిన రాజస్థాన్
తిప్పేసిన హర్‌ప్రీత్ ఫ వధేరా, శశాంక్ మెరుపులు
జైపూర్: లెఫ్టామ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ (3/22) కీలక వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) ధనాధన్ అర్ధ శతకాలతో చెలరేగారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఢిల్లీని ఓడించడంతో పంజాబ్.. పదేళ్ల సుదీర్ఘ విరామానంతరం ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారిగా 2014లో పేఆఫ్స్ చేరిన పంజాబ్.. ఆ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (30) రాణించాడు. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 209/7 స్కోరు మాత్రమే చేసింది. ధ్రువ్ జురెల్ (53), యశస్వి జైస్వాల్ (50) హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి. జెన్సన్, ఒమర్జాయ్ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. హర్‌ప్రీత్ బ్రార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆరంభం అదిరినా..: రాయల్స్ ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ (40) తొలి వికెట్‌కు 29 బంతుల్లోనే 79 పరుగులతో ఛేదనను ధాటిగా ఆరంభించారు. అయితే, ఐదో ఓవర్‌లో హర్‌ప్రీత్ బౌలింగ్‌కు దిగడంతో సీన్ మారింది. వైభవ్‌ను అవుట్ చేసిన హర్‌ప్రీత్ బ్రేక్‌ను అందించాడు. ఆ తర్వాత 9వ ఓవర్‌లో జైస్వాల్‌ను పెవిలియన్ చేర్చిన బ్రార్.. రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. శాంసన్ (20)ను ఒమర్జాయ్ అవుట్ చేయగా.. పరాగ్ (13)ను కూడా హర్‌ప్రీత్ బౌల్డ్ చేయడంతో 14 ఓవర్లకు రాజస్థాన్ 146/4తో నిలిచింది. డెత్ ఓవర్లలో జురెల్ ధాటిగా ఆడుతూ ఆశలు రేపాడు. కానీ, ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 రన్స్ కావల్సి ఉండగా.. జురెల్, హసరంగ (0)ను అవుట్ చేసిన జెన్సన్ జట్టును గెలిపించాడు.

తడబడి నిలబడి..: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న పంజాబ్ పవర్‌ప్లేలోనే 34/3తో కష్టాల్లో పడినా.. వధేరా, శశాంక్ సింగ్ అర్ధ శతకాలతో ఆదుకోవడంతో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆర్య (9), ప్రభ్‌సిమ్రన్ (21)ను దేశ్‌పాండే వెనక్కిపంపగా.. ఓవెన్ (0)ను మఫాక డకౌట్ చేశాడు. ఈ దశలో వధేరాకు జతకలసిన కెప్టెన్ అయ్యర్ నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, అయ్యర్‌ను పరాగ్ క్యాచవుట్ చేయడంతో క్రీజులోకి వచ్చిన శశాంక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, అర్ధ శతకం పూర్తి చేసుకొన్న వధేరాను ఆకాశ్ అవుట్ చేయడంతో.. ఐదో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక, డెత్ ఓవర్లలో శశాంక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 నాటౌట్) 24 బంతుల్లో 60 పరుగులు జోడించడంతో.. పంజాబ్ స్కోరు 220 మార్క్‌కు చేరువైంది.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (సి) హెట్‌మయర్ (బి) దేశ్‌పాండే 9, ప్రభ్‌సిమ్రన్ (సి) శాంసన్ (బి) దేశ్‌పాండే 21, ఓవెన్ (సి) శాంసన్ (బి) మఫాక 0, వధేరా (సి)హెట్‌మయర్ (బి) మధ్వాల్ 70, శ్రేయాస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30, శశాంక్ (నాటౌట్) 59, అజ్మతుల్లా ఒమర్జాయ్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 219/5; వికెట్ల పతనం: 1-19, 2-34, 3-34, 4-101, 5-159; బౌలింగ్: ఫజల్ ఫరూకీ 3-0-39-0, దేశ్‌పాండే 4-0-37-2, మఫాక 3-0-32-1, పరాగ్ 3-0-26-1, హసరంగ 3-0-33-0, మధ్వాల్ 4-0-48-1.
రాజస్థాన్: జైస్వాల్ (సి) ఓవెన్ (బి) బ్రార్ 50, వైభవ్ (సి) బ్రాట్‌లెట్ (బి) బ్రార్ 40, శాంసన్ (సి) జెన్సన్ (బి) ఒమర్జాయ్ 20, పరాగ్ (బి) బ్రార్ 13, జురెల్ (సి) ఓవెన్ (బి) జెన్సన్ 53, హెట్‌మయర్ (సి) బ్రాట్‌లెట్ (బి) ఒమర్జాయ్ 11, దూబె (నాటౌట్) 7, హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) జెన్సన్ 0, మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 209/7; వికెట్ల పతనం: 1-76, 2-109, 3-114, 4-144, 5-181, 6-200, 7-200; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-60-0, జెన్సన్ 3-0-41-2, బ్రాట్‌లెట్ 1-0-12-0, హర్‌ప్రీత్ బ్రార్ 4-0-22-3, చాహల్ 4-0-30-0, ఒమర్జాయ్ 4-0-44-2.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
గుజరాత్ 12 9 3 0 18 0.795
బెంగళూరు 12 8 3 1 17 0.482
పంజాబ్ 12 8 3 1 17 0.389
ముంబై 12 7 5 0 14 1.156
ఢిల్లీ 12 6 5 1 13 0.260
కోల్‌కతా 13 5 6 2 12 0.193
లఖ్‌నవూ 11 5 6 0 10 -0.469
హైదరాబాద్ 11 3 7 1 7 -1.192
రాజస్థాన్ 13 3 10 0 6 -0.701
చెన్నై 12 3 9 0 6 -0.992
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..