Pro Kabaddi: విశాఖలో ప్రొ కబడ్డీ లీగ్
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:22 AM
ప్రొ కబడ్డీ సీజన్ 12వ అంచెకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. 12 జట్లు పాల్గొనే ఈ లీగ్‌ను మొత్తం నాలుగు నగరాల్లో
వచ్చే 29నుంచి నాలుగు నగరాల్లో పోటీలు
ముంబై: ప్రొ కబడ్డీ సీజన్ 12వ అంచెకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. 12 జట్లు పాల్గొనే ఈ లీగ్‌ను మొత్తం నాలుగు నగరాల్లో.. విశాఖతోపాటు జైపూర్, చెన్నై, ఢిల్లీలో నిర్వహించనున్నారు. 2018లో పోటీలు జరగ్గా.. మళ్లీ ఏడేళ్ల తర్వాత పీకేఎల్ సాగరతీరానికి తిరిగి రానుందని నిర్వాహకులు తెలిపా రు. కాగా మొత్తం 108 మ్యాచ్‌లకుగాను విశాఖలో 28 జరుగుతాయి.
లీగ్ వివరాలు : ఆగస్టు 29-అక్టోబరు 23
తొలి అంచె-విశాఖపట్నం: ఆగస్టు 29-సెప్టెంబరు 11
రెండో అంచె-జైపూర్ : సెప్టెంబరు 12-28
మూడో అంచె-చెన్నై : సెప్టెంబరు 29-అక్టోబరు 12
నాలుగో అంచె-న్యూఢిల్లీ : అక్టోబరు 13-23