Blind Womens T20 Cricket: మీ విజయం భావి తరాలకు స్ఫూర్తి
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:24 AM
మహిళల అంధుల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో మోదీని భారత జట్టు సభ్యులు మర్యాదపూర్వకంగా...
అంధుల క్రికెట్ జట్టుతో ప్రధాని మోదీ ఇష్టాగోష్ఠి
న్యూఢిల్లీ: మహిళల అంధుల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో మోదీని భారత జట్టు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఇష్టాగోష్ఠిలో భారత కెప్టెన్, అనంతపురం అమ్మాయి దీపిక, పాడేరు యువ క్రికెటర్ కరుణ కుమారి.. మోదీతో ముచ్చటించారు. దీపిక పాటలు బాగా పాడుతుందని తెలిసి ఆమెను మోదీ ఒక పాట పాడాలని అడిగారు. దాంతో దీపిక శివుడి భక్తి గీతం ఆలపించగా.. ఆమెను మోదీ అభినందించారు. చివర్లో జట్టు సభ్యులు సంతకం చేసిన బ్యాట్‌ను మోదీకి దీపిక బహూకరించింది. కొన్ని క్రికెట్ బంతులపై జట్టు సభ్యులు మోదీ సంతకాలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ