Share News

దక్షిణాఫ్రికా 418 పరుగులు 9 వికెట్‌కు

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:25 AM

అరంగేట్ర ఆటగాడు లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153)తోపాటు కార్బిన్‌ బాష్‌ (100 బ్యాటింగ్‌) శతక మోత మోగించడంతో జింబాబ్వేతో శనివారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు దక్షిణాఫ్రికా...

దక్షిణాఫ్రికా 418 పరుగులు 9 వికెట్‌కు

  • ప్రిటోరియస్‌, బాష్‌ సెంచరీలు

  • జింబాబ్వేతో తొలి టెస్టు

బులవాయో: అరంగేట్ర ఆటగాడు లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (153)తోపాటు కార్బిన్‌ బాష్‌ (100 బ్యాటింగ్‌) శతక మోత మోగించడంతో జింబాబ్వేతో శనివారం మొదలైన తొలి టెస్టు మొదటి రోజు దక్షిణాఫ్రికా 400కు పైగా పరుగులు చేసింది. 55/4తో ఉన్న దశలో మరో అరంగేట్ర ఆటగాడు బ్రేవిస్‌ (51)తో కలిసి ఐదో వికెట్‌కు ప్రిటోరియస్‌ 95 రన్స్‌ జోడించాడు. అనంతరం బాష్‌ జతగా ఏడో వికెట్‌కు 108 రన్స్‌ జత చేశాడు. దాంతో ఆట ముగిసేసరికి సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 418/9 స్కోరు చేశారు. చివంగ 4 వికెట్లు పడగొట్టాడు. కాగా.. 19 ఏళ్ల 93 రోజుల్లో శతకం బాదిన ప్రిటోరియస్‌ అతి పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా 61 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టాడు. 1964లో గ్రేమ్‌ పొలాక్‌ (19 ఏళ్ల 317 రోజులు) రికార్డును అధిగమించాడు.

ఇవీ చదవండి:

డేంజరస్ సెలబ్రేషన్.. పంత్‌ పరిస్థితేంటి..

కోచ్‌తో భారత స్టార్ల కొట్లాట

రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 03:25 AM