Share News

Top Chess Player: యూజెడ్‌ విజేత ప్రజ్ఞానంద

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:44 AM

గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద యూజెడ్‌ చెస్‌ కప్‌లో విజేతగా నిలిచాడు. దాంతో లైవ్‌ రేటింగ్‌లో భారత టాప్‌ ర్యాంక్‌ ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీ విజయంతో ప్రజ్ఞానంద రేటింగ్‌ 2778.3కి చేరింది.

Top Chess Player: యూజెడ్‌ విజేత ప్రజ్ఞానంద

  • భారత టాప్‌ ర్యాంక్‌ కైవసం

తాష్కెంట్‌: గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద యూజెడ్‌ చెస్‌ కప్‌లో విజేతగా నిలిచాడు. దాంతో లైవ్‌ రేటింగ్‌లో భారత టాప్‌ ర్యాంక్‌ ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీ విజయంతో ప్రజ్ఞానంద రేటింగ్‌ 2778.3కి చేరింది. ఫలితంగా అతడు ఫిడే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానం దక్కించుకున్నాడు. కెరీర్‌లో ప్రజ్ఞానందకిది అత్యుత్తమ ర్యాంక్‌. ఈక్రమంలో వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ (2776.6), గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి (2775.7)ని 19 ఏళ్ల ప్రజ్ఞానంద వెనక్కు నెట్టాడు. కాగా..గురువారం వరకు అర్జున్‌ భారత టాప్‌ ర్యాంక్‌ ఆటగాడిగా కొనసాగాడు. తాజా ర్యాంకుల్లో అతడు ఆరో స్థానానికి దిగజారగా, గుకేష్‌ ఐదో ర్యాంక్‌లో నిలిచాడు.

Updated Date - Jun 28 , 2025 | 04:47 AM