లక్ష్యం.. ఒలింపిక్స్ ఆతిథ్యం
ABN , Publish Date - May 05 , 2025 | 04:44 AM
2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యంగా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలో క్రీడా సంస్కృతి పెరిగితే, అంతర్జాతీయంగా భారత్...
ప్రధాని మోదీ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభం
పట్నా: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యంగా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలో క్రీడా సంస్కృతి పెరిగితే, అంతర్జాతీయంగా భారత్ పరపతి ఇనుమడిస్తుందని.. ఆదివారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభం సందర్భంగా మోదీ అన్నారు. బిహార్ రాజధాని పట్నా వేదికగా జరుగుతున్న ఈ పోటీలను మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
వైభవ్ సూర్యవంశీకి ప్రశంస: ఈ సందర్భంగా తన ప్రసంగంలో మోదీ.. 14 ఏళ్ల‘ బిహార్‌కు చెందిన టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావించారు. ‘బిహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రతిభను ఐపీఎల్ మ్యాచ్‌లో తిలకించా. ఇంత చిన్న వయస్సులో అంత గొప్ప రికార్డు సాధించడం ఆషామాషీ కాదు. వైభవ్ ప్రతిభ వెనుక ఎంతో కష్టం దాగి ఉంది’ అని ప్రధాని కొనియాడారు. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ‘చిన్నో’డు సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..